FbTelugu

ఫోర్బ్స్ జాబితాలో.. నల్లగొండ యువకుడు

  నల్లగొండ: ఫోర్బ్స్ అండర్ 30 జాబితాలో 25 ఏళ్ల నల్లగొండ యువకుడు స్థానం సంపాధించారు. వివరాల్లోకెళితే.. నల్లగొండ జిల్లాకు చెందిన సందీప్ అనే యువకుడు ఇడుపులపాయ ఆర్‌జీయూకేటీలో ఇంజినీరింగ్ పూర్తిచేశాడు. ఇతడు ఆరోగ్య సంరక్షణ విభాగంలో విశేషంగా కృషి చేసి.. ఓ వినూత్న యాప్ ను రూపొందించాడు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్/ కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే ఈ యాప్ సాయంతో ఇతర దేశాల్లోని వైద్యులు ఇచ్చే సూచనలు, సలహాలను రోగుల మాతృభాషలోకి అనువదించే వీలు కల్పిస్తుందని. ఇంతటి ఉపయోగకరమైన యాప్ ను రూపొందించినందుకు గానూ ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.