FbTelugu

పోలీస్ స్టేషన్ లలో సీసీ టీవీ ల ఏర్పాటు పై త్వరలోనే తీర్పు…

ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న పోలీసు స్టేషన్లలో సీసీటీవీల ఏర్పాటుపై సుప్రీం కోర్టు తన తీర్పును వాయిదా వేసింది.
వ్యవస్థను చక్కదిద్దేలా తాము ఒకటి, రెండు రోజుల్లోనే ఉత్తర్వులు ఇస్తామని స్పష్టం చేసింది. పోలీసు స్టేషన్లలో మానవ హక్కులకు భంగం వాటిల్లకుండా చూడడంలో భాగంగా స్టేషన్లలో సీసీటీవీ వ్యవస్థను ఏర్పాటు చేసే విషయమై తీర్పును సుప్రీంకోర్టు వాయిదా వేసింది. జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌.నారీమన్‌, జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌ల ధర్మాసనం మంగళవారం ఈ విషయాన్ని ప్రకటించింది.

పోలీసు స్టేషన్లలో నమోదయ్యే సీసీటీవీ దృశ్యాలను కనీసం 45 రోజులపాటు భద్రపరచాలని, దానికి తగ్గ వ్యవస్థను సిద్ధం చేయాల్సి ఉందని పేర్కొంది. వ్యవస్థను చక్కదిద్దేలా తాము ఒకటిరెండు రోజుల్లోనే ఉత్తర్వులు ఇస్తామని తెలిపింది. సీసీటీవీ వ్యవస్థ ఏర్పాటుపై 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఎంతవరకు అమలు చేసిందీ తెలియజేస్తూ వివిధ రాష్ట్రాలు ప్రమాణపత్రాలు దాఖలు చేశాయని న్యాయస్థాన సహాయకునిగా నియమితుడైన న్యాయవాది సిద్దార్ధ దవే తెలిపారు.
కెమెరాలు పనిచేయడానికి కావాల్సిన విద్యుత్తు, ఇంటర్నెట్‌ వంటివి రాష్ట్రాలు సమకూర్చాలని, వీటి పనితీరుకు స్టేషన్‌ హౌస్‌ అధికారులను బాధ్యుల్ని చేయాలని అటార్నీ జనరల్‌ కె.కె.వేణుగోపాల్‌ కోరారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.