FbTelugu

మహారాష్ట్రలో ఒక్కరోజే 850 మంది మృతి

ముంబయి: మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కేసులతో పాటు మరణాలు కూడా పెరుగుతుండడంతో ప్రజలు కలవరపడుతున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మరణాలు సంభవించాయి.
గత 24 గంటల వ్యవధిలో 42,582 పాజిటివ్ కేసులు నమోదు కాగా 850 మంది చనిపోయారని మహారాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. గతవారం రోజుకు 160 మందికి అటు ఇటుగా చనిపోగా తాజా మరణాల సంఖ్య 850కి ఎగబాకింది. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 5,33,294 ఉండగా ఒక్క ముంబై నగరంలోనే 1952 కేసులు ఉన్నాయి. ఇక్కడ అక్కడా అనే తేడా లేకుండా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు నిర్థారణ అవుతున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.