FbTelugu

పీసీసీ చీఫ్ ఎన్నిక కోసం ఇన్ ఛార్జీ రాక: ఉత్తమ్

హైదరాబాద్: పీసీసీ అధ్యక్షుడిగా కొత్త నాయకుడిని ఎన్నిక చేసేందుకు బుధవారం నాడు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జీ మానిక్కం ఠాకూర్ హైదరాబాద్ వస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్ తెలిపారు.
గాంధీ భవన్ లో కొత్త పీసీసీ అధ్యక్ష ఎన్నిక పై నేతలందరి అభిప్రాయం తీసుకుంటారని ఆయన అన్నారు. మెజార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయం ప్రకారం కొత్త పీసీసీ ఎంపిక ఉంటుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేతలు రైతు బంద్ లో పాల్గొని విజయవంతం చేశారు. ఆహార ధాన్యాలు ఇప్పటి వరకు నిల్వచేసుకునే అవకాశం ఉండేది. కానీ మోదీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు కూడా ఆహార ధాన్యాలు నిల్వచేసుకునే కొత్త చట్టం తీసుకొచ్చిందని ఆయన ఆరోపించారు.

కార్పొరేట్ కంపెనీలకు సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతుందని ఆయన విమర్శించారు. రైతుల పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సెల్యూట్ చేస్తుందన్నారు. సన్న రకాలు వడ్లు, పత్తి, జొన్నలకు మద్దతు ధర ఇవ్వకుండా టీఆర్ఎస్ పార్టీ భారత్ బంద్ లో పాల్గొని ఆందోళన చేయడం విడ్డూరంగా ఉందని ఉత్తమ్ వ్యాఖ్యానించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.