FbTelugu

బ్రిటన్ లో మళ్లీ కరోనా సినిమా!

లండన్: త్వరలోనే బ్రిటన్ లో థర్డ్ వేవ్ ప్రారంభమైందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం కేసుల సంఖ్య తక్కువగానే కన్పిస్తున్నా మున్ముందు తీవ్రమై ప్రజలకు పెనుముప్పుగా పరిణమిస్తుందంటున్నారు.

కొన్ని దేశాల్లో ఇప్పుడు సెకండ్ వేవ్ విజృంభిస్తుండగా, మరికొన్ని దేశాల్లో థర్డ్ వేవ్ ప్రారంభం అయిందంటున్నారు. భారత్ లాంటి దేశంలో సెకండ్ వేవ్ ఉధృతి భయంకరంగా ఉండడంతో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ విధించడంతో కేసులు తగ్గుముఖం పట్టాయి. పలు రాష్ట్రాలలో ఆంక్షలు ఇంకా కొనసాగిస్తున్నారు. బ్రిటన్ లో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైందని కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రొఫెసర్ రవి గుప్తా తెలిపారు. దేశంలో నమోదు అవుతున్న కొత్త కేసుల్లో నాలుగింట మూడొంతులు భారత్ లో బయటపడ్డ బి.1.617 రకానివని ఆయన అన్నారు. కొద్ది రోజుల్లో వైరస్ విజృంభించి తారాస్థాయికి వెళ్తుందని రవిగుప్తా ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని కార్యకలాపాలను పూర్తి స్థాయిలో పునఃప్రారంభించేందుకు బ్రిటన్ ప్రధాన బోరిస్ సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో రవి గుప్తా పిడుగు లాంటి వార్త చెప్పారు. థర్డ్ వేవ్ వల్ల కలిగే నష్టాలపై ప్రధాని బోరిస్ ను హెచ్చరించడం జరిగిందని ఆయన వివరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.