FbTelugu

కరోనా వ్యాప్తిపై ఐఎంఎస్సీ సంచలన కామెంట్స్

చెన్నై: దేశంలో కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కు సడలింపులను ఇచ్చిన తర్వాత కరోనా వ్యాప్తి పట్ల చెన్నైకి చెందిన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేథమేటికల్ సైన్సెస్ (ఐఎంఎస్సీ) సంచలన కామెంట్స్ చేసింది. కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే రేటు లాక్ డౌన్ సడలించినప్పటికీ తగ్గిందని తెలిపింది.

వారి అధ్యయనంలో లాక్ డౌన్ విధించక ముందు 100 మంది నుంచి 183 మందికి వ్యాపించే రేటు ఉండగా.. ప్రస్తుతం 100 మంది నుంచి 122 మందికే వ్యాపిస్తున్నట్టు తేలిందని తెలిపారు. దేశంలో కరోనా వ్యాప్తిపై తాము నిర్వహించిన సర్వేలో ఈ వివరాలు తెలిసినట్టు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.