FbTelugu

ఐఏఎస్ తో పాటు మరొకరికి జైలుశిక్ష: హైకోర్టు

అమరావతి: ఇద్దరు అఖిల భారత సర్వీసు (ఏఐఎస్) అధికారులకు ఏపి హైకోర్టు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. సీనియర్ ఐఏఎస్ అధికారులు గిరిజా శంకర్‍, ఐఎఫ్ఎస్ అధికారి చిరంజీవి చౌదరి లకు చేరో వారం రోజులు జైలు శిక్ష విధించింది.

36 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని ఏప్రిల్‍ నెలలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అప్పటి నుంచి వారి ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయకపోవడంతో పలుమార్లు ఉత్తర్వులు అమలు చేయాలని హైకోర్టు సూచించింది. అయినా అమలు చేయకుండా ఇద్దరు ఉన్నధికారులు పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శించారు. ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇవాళ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరైన చిరంజీవి చౌదరి, గిరిజాశంకర్ లకు వారం రోజులు జైలు శిక్ష విధించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.