FbTelugu

కరోనా తో సున్నా రేటు వడ్డీ అమలు

న్యూయార్క్: కరోనా వైరస్ గడగడలాడిస్తున్న నేపథ్యంలో యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ రిజర్వ్ సంచలన నిర్ణయం ప్రకటించింది. ఇప్పటికే కనిష్ఠ స్థాయిలో 0.25 శాతంగా ఉన్న వడ్డీ రేటును సున్నా శాతానికి తగ్గించింది.

కరోనా ప్రభావం అమెరికా ఆర్థిక వ్యవస్థను దిగజార్చుతున్న నేపథ్యంలో ఆదివారం నాడు యూఎస్ పెడ్ అత్యవసరంగా సమావేశమైంది. ఈ సమావేశంలో సున్నా వడ్డీ రేటు నిర్ణయం తీసుకున్నామని ప్రకటించింది.
అమెరికా గతంలో 2008లో లీమన్ బ్రదర్స్ దివాలా తరువాత ఏర్పడిన ఆర్థిక మాంద్యం నేపథ్యంలో వడ్డీ రేట్లను సున్నా శాతానికి అమలు చేసింది. ఆ తరువాత రెండోసారి అమెరికా నిర్ణయం తీసుకున్నది ఇఫ్పుడే.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More