FbTelugu

మంచు తుఫాన్ తో 10 కోట్ల మందిపై ప్రభావం

వాషింగ్టన్: పలు రాష్ట్రాలలో మంచు తుఫాన్ కారణంగా చలిగాలుల తీవ్రతకు 20 మంది మృత్యువాత పడ్డారు. మంచు ధాటికి లుసియానా, టెక్సాస్, మిసిసిప్పీలో విద్యుత్ లైన్లు ధ్వంసమయ్యాయి. దీంతో పలు నగరాలలో 30 లక్షల మంది అంధకారంలో మగ్గుతున్నారు.

మంచు కారణంగా అమెరికాలో కరోనా వ్యాక్సినేషన్‌కు అంతరాయం ఏర్పడింది. అసలే మంచు తుఫాన్ ఆపై విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇంట్లో నీటి సరఫరా లేక అనేక అవస్థలు పడుతున్నారు. విద్యుత్తు పునరుద్ధరణకు చర్యలు చేపట్టినప్పటికీ మంచు ఆటంకం కలిగిస్తున్నది. విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు మరికొంత సమయం తీసుకుంటుందని ప్రభుత్వం ప్రకటించింది. పలు ప్రాంతాలలో -22 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతున్నది.

విద్యుత్తు ఆగిపోవడంతో ప్రత్యామ్నాయంగా వేడి కాచుకునేందుకు ఇంటి లోపల మంట పెడుతున్నారు. ఈ నిప్పు ఇతర గదులకు వ్యాపించి చనిపోయిన ఘటనలు నమోదవుతున్నాయి. మంచు తుఫాన్‌ ప్రభావం దాదాపు 10 కోట్ల మందిపై ఉంటుందని అధికారులు అంచనా వేసి సహాయక చర్యలు చేపట్టారు. ఈ కారణంగా వందల విమానాల సర్వీసులను రద్ధు చేశారు. ధ్రువాల వద్ద నుంచి వచ్చే చల్లని గాలుల (పోలార్‌ వర్టెక్స్‌) వల్లే అమెరికాలో ఈ అసాధారణ పరిస్థితులు నెలకొన్నట్టు వాతావరణ శాస్త్రవేత్తలు వెల్లడించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.