FbTelugu

ఇండియా ఆర్థిక స్థిరత్వం పై క్రిప్టో కరెన్సీ ప్రభావం…

ముంబయి: క్రిప్టో కరెన్సీ ఇండియా ఆర్థిక స్థిరత్వంపై ప్రభావం చూపుతుందని, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పెద్దలకు తెలియచేశామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.

క్రిప్టో కరెన్సీ, ఇండియా డిజిటల్ కరెన్సీ పై శక్తికాంత దాస్ ఒక వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ మధ్య కాలంలో క్రిప్టో కరెన్సీ విలువ దూసుకుపోతున్నదని, దీనికి ప్రత్యామ్నాయంగా దేశంలో డిజిటల్ కరెన్సీ తీసుకురానున్నామని ఆయన చెప్పారు. చైనాలో ఉన్న ఎలక్ట్రానిక్ యువాన్ తో పాటు డిజిటల్ కరెన్సీ ఉన్న ఇతర దేశాల జాబితాలో ఇండియా చేరుతుందని శక్తికాంత దాస్ స్పష్టం చేశారు.

అయితే ఎప్పుడు ప్రజలకు అందుబాటులోకి వస్తుందనే దానిపై స్పష్టంగా చెప్పలేమని అన్నారు. దీన్ని ప్రవేశపెట్టే మందు పలు అంశాలను చర్చించాలని, చట్ట సవరణ చేయాల్సి ఉంటుందని ఆయన గుర్తు చేశారు. దేశంలో బిట్ కాయిన్ ప్రవేశాన్ని నిరోధిస్తూ 2018లో నిషేధించింది. ఈ నిర్ణయాన్ని 2020 లో సుప్రీంకోర్టు కొట్టివేసింది. సుప్రీం నిర్ణయంతో ప్రైవేటు క్రిప్టో కరెన్సీకి మూకుతాడు వేయాలని, సొంతంగా డిజిటల్ కరెన్సీని తీసుకురావాలని నిర్ణయించిన కేంద్రం ఆ దిశగా ప్రయత్నాలు పూర్తిచేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.