FbTelugu

ముంబయి వీడుతున్న వలస జనం

ముంబయి: మహారాష్ట్రలో ఇవాళ రాత్రి నుంచి మహా జనతా కర్ఫ్యూ నేపథ్యంలో వలస కూలీలు రైల్వే స్టేషన్ బాట పట్టారు. రెండు వారాల పాటు కఠిన ఆంక్షల నేపథ్యంలో స్వస్థాలకు పయనమయ్యారు.

బుధవారం ఉదయం లోకమాన్య తిలక్ టెర్మినస్ రైల్వే స్టేషన్ ముందు జనం కిలోమీటర్ల కొద్ది వరుసలో నిల్చున్నారు. అధిక సంఖ్యలో రైల్వే స్టేషన్ రావద్దని రైల్వే అధికారులు కోరినా జనం పట్టించుకోకుండా వస్తున్నారు. మూటా ముళ్లె సర్దుకుని వస్తున్న జనాన్ని నియంత్రించేందుకు స్థానిక పోలీసులు, రైల్వే పోలీసులు పెద్ద ఎత్తున మొహరించారు. రాత్రి 8 గంటల నుంచి ఆంక్షలు అమలవుతుండగా ఆ లోపే నగరం విడిచి వెళ్లిపోవాలనే ఉద్దేశ్యంతో స్టేషన్ కు వస్తున్నారని అధికారులు తెలిపారు. ఈ ఒక్క స్టేషన్ కాకుండా బస్ స్టాండ్లు, ఇతర రైల్వే స్టేషన్లు, జాతీయ రహదారులపై జనం తమ గమ్యస్థానం చేరేందుకు ఏ వాహనం దొరికినా వదిలిపెట్టడం లేదు.

You might also like

Leave A Reply

Your email address will not be published.