FbTelugu

మోదీ కరోనా సూపర్ స్ర్పెడర్: ఐఎంఏ

న్యూఢిల్లీ: దేశంలో ఊహించని విధంగా ఇంతలా కరోనా మహమ్మారి విజృంభించడానికి ప్రధాన కారకుడు నరేంద్ర మోదీ అని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఉపాధ్యక్షుడు నవజోత్ దహియా ఆరోపించారు.

కరోనా వైరస్ కు మోదీని సూపర్ స్ర్పెడర్ గా ఆయన అభివర్ణించారు. దేశంలో సెకండ్ వేవ్ ఉధృతంగా పెరుగుతుంటే ప్రధాని తాపీగా ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ప్రచార సభలు నిర్వహించారని, కుంభ మేళాకు అనుమతించారన్నారు. దేశంలో ఈ దుస్థికి అవి దారితీశాయన్నారు. వైద్య, ఆరోగ్య సిబ్బంది, ప్రభుత్వ అధికారులు కరోనా నిబంధనలు పాటించేలా అవగాహన కల్పిస్తూ తీవ్రంగా కృషి చేస్తుంటే, మోదీ ఇవేమి పట్టించుకోకుండా భారీ ప్రచార సభల్లో పాల్గొన్నారన్నారు. కరోనా నిబంధనలు ఆయన గాలికి వదిలేశారని విమర్శించారు. ఇండియాలో గతేడాది జనవరిలో తొలి కరోనా కేసు నమోదు అయినప్పుడు కూడా మోదీ నిర్లక్ష్యంగా వ్యవహరించారని నవజోత్ దహియా ఆరోపించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.