FbTelugu

సామాజిక వ్యాప్తి పరుగు పెడుతోంది: ఐఎంఏ

ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ సామాజిక వ్యాప్తి మొదలైందని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) కీలక ప్రకటన చేసింది.

పరిస్థితి ఏమాత్రం బాగోలేదని, కేసులు తామరతంపరగా పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో సగటున రోజుకు 30 వేల కొత్త కేసులు వస్తున్నాయి. నిన్నటి వరకు పట్టణ ప్రాంతాలకే పరిమితమైన వైరస్ కొద్ది రోజులుగా గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించిందని ఐఎంఏ హాస్పిటల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు డాక్టర్‌ వి.కె.మొంగా వెల్లడించారు.

పట్టణాలు, గ్రామాల్లో వేగంగా విస్తరిస్తున్న వైరస్‌ను నియంత్రించడం అంత సులువైన పని కాదని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు కేంద్ర సాయాన్ని తీసుకుంటే తప్ప అదుపు చేయడం కష్టమన్నారు. వైరస్‌కు కళ్లెం పడాలంటే రెండే మార్గాలున్నాయి. మొత్తం జనాభాలో 70 శాతం మందికి వైరస్‌ సోకితే సామూహిక వ్యాధి నిరోధక శక్తి వస్తుందన్నారు. ఇక రెండో మార్గం ఏమంటే టీకాల ద్వారా వ్యాధి నిరోధకత సాధించడం అని మొంగా వివరించారు.

You might also like