FbTelugu

టీకా వేయించుకున్న మహిళకు అస్వస్థత

విజయవాడ: నేడు దేశవ్యాప్తంగా కరోనా టీకా పంపిణీ ప్రారంభమైన విషయం తెలిసిందే. కాగా విజయవాడలో కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న హెల్త్ వర్కర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యింది. దీంతో విజయవాడలోని జీజీహెచ్ ఆసుపత్రిలో కొంత టెన్షన్ నెలకొంది. వివరాల్లోకెళితే..

రాధ అనే హెల్త్ వర్కర్ కు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత వెంటనే ఆమె కళ్లు తిరిగి పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన వైద్య సిబ్బంది ఆమెకు అత్యవసర చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. టీకా వేయించుకున్న తర్వాత తనకు కళ్లు తిరిగినట్టు అనిపించిందని, చాలా చలిగా అనిపించిందని రాధ తెలిపారు. ప్రస్తుతం బాగానే ఉన్నట్టు తెలిపింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.