FbTelugu

అక్రమ సంబంధం… ఇద్దరు డాక్టర్ల హత్య

జైపూర్: డాక్టర్లు అయిన భార్యాభర్తలను ఒక వ్యక్తి దారుణంగా కాల్చి చంపిన ఘటన రాజస్థాన్ లోని భరత్ పూర్ లో జరిగింది. ఈ కాల్పుల్లో ఇద్దరు కారులోనే ప్రాణాలొదిరారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం డాక్టర్ సందీప్ గుప్తా, ఆయన భార్య సీమా తమ కారులో వెళ్తున్నారు. వారి వెనకాలే టూ వీలర్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కారును ఆపివేయించారు. ఆ తరువాత డోర్ దగ్గరకు వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేయగా అద్దం దించగానే తుపాకీతో దంపతులపై కాల్పులు జరిపాడు. కాల్పుల శబ్ధంతో రోడ్డుపై వెళ్తున్నవారు పరుగులు తీశారు. చనిపోయారని నిర్థారించుకున్న తరువాత ఇద్దరు టూ వీలర్ పై పరారీ అయ్యారు. ఈ ఘటన మొత్తం సిసిటివిలో రికార్డు కావడంతో నిందితుల కోసం పోలీసులు గాలింపు మొదలుపెట్టారు.

డాక్టర్ సందీప్ గుప్తా, ఆయన భార్య సీమా 2019లో ఇద్దరి హత్య కేసులో అరెస్టు అయి, జైలు శిక్ష అనుభవించి విడుదల అయ్యారు. ఒక మహిళతో సందీప్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. మహిళకు ఐదేళ్ల కుమారుడు కూడా కలిగాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ఆ మహిళను సందీప్, ఆయన భార్య సీమా కలిసి చంపేశారు. ఈ కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. మృతి చెందిన మహిళ సోదరులే ఈ హత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.