FbTelugu

వినూత్న రీతిలో ఏపీకి అక్రమ మద్యం తరలింపు

గుంటూరు: ఏపీలో మద్యంపై ఆంక్షలు, ధర కూడా ఎక్కువైన తరుణంలో కొందరు దుండగులు తెలంగాణలో మద్యాన్ని చౌకగా కొని ఏపీకి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా మంచి నీళ్ల ట్యాంక‌ర్ నిండా మ‌ద్యం బాటిళ్లను తరలిస్తుండగా.. పోలీసులకు పట్టుబడింది.

వివరాల్లోకెళితే.. సత్తెనపల్లికి చెందిన కొందరు దుండగులు తెలంగాణ నుంచి అక్రమంగా మద్యాన్ని వాటర్ ట్యాంక్ లో తరలిస్తుండగా.. గుంటూరు జిల్లా మునుగోడు మండలం అమరావతి వద్ద పోలీసుల‌ తనిఖీల్లో పట్టుబడింది. ముందస్తు సమాచారం మేరకే వారిని పట్టుకుని వారిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

You might also like