FbTelugu

సుస్థిర ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలి: వెంకయ్య నాయుడు

న్యూఢిల్లీ: పర్యావరణహిత, సుస్థిర నిర్మాణాలపై దృష్టి పెట్టాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఇవాళ ఆయన ఐఐఏ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేశారు.

నిర్మాణాల్లో సౌందర్యంతో పాటూ.. సౌకర్యానికీ ప్రాధాన్యమివ్వాలని అన్నారు. నాగరికత సాధించిన విజయాల్లో ఆర్కిటెక్చర్ కూడా ఒకటని తెలిపారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో స్థానిక కళాకారులకు అవకాశం ఇవ్వాలన్నారు.

You might also like