FbTelugu

షర్మిల విమర్శలు పట్టించుకోవద్దు

మూడు పార్టీల నిర్ణయం
హైదరాబాద్: తెలంగాణలో పార్టీ పెడుతున్నట్లు ప్రకటించిన సభావేదిక నుంచి వైఎస్.షర్మిల చేసిన విమర్శలపై మూడు ప్రధాన పార్టీలు మౌనం వహించాయి. మన రాష్ట్రం కాని మహిళ విమర్శిస్తే ప్రతిస్పందించడం అనవసరం అనే నిర్ణయానికి వచ్చారు.
కాంగ్రెస నుంచి వి.హన్మంతరావు, బిజెపి నుంచి ఎన్వీఎస్ఎస్.ప్రభాకర్ మాత్రమే స్పందించారు. టీఆర్ఎస్ నుంచి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పరోక్షంగా విమర్శలు చేశారు తప్పితే పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదు. విమర్శించి ఆమెను నాయకురాలిగా తయారు చేయవద్దని, అంతగా ప్రాధాన్యం ఇవ్వొద్దని కాంగ్రెస్ నాయకులు ఏకాభిప్రాయానికి వచ్చారు.

టిఆర్ఎస్ పార్టీ పెద్దలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం. ఖమ్మం సభ తరువాత ఎమ్మెల్యే భట్టి విక్రమార్కతో ఖండన ఇప్పించాలని మొదట్లో అనుకున్నా వెనన్కి తగ్గారు. ఆమె విమర్శలకు బదులు ఇచ్చి పెద్ద నాయకురాలిగా తయారు చేయడం తప్ప మరేమి లేదనే నిర్ణయానికి వచ్చారు.
తెలిసి తెలియని సమాచారం తో షర్మిల విమర్శలకు సమాధానం ఇవ్వకపోవడమే మేలనే నిర్ణయానికి టిఆర్ఎస్ వచ్చింది. ఆమె స్వంత ఊరు, భర్త స్వగ్రామం తెలంగాణ కాదని, అలాంటప్పుడు స్పందించి ఎందుకనే ఆలోచన టిఆర్ఎస్ చేసింది. ఇక బిజెపి నుంచి మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్.ప్రభాకర్ మాత్రం టిఆర్ఎస్ పార్టీ వదిలిన బాణం షర్మిల అని, స్క్రిప్ట్ కెసిఆర్ రాసిచ్చేందేనంటూ ఘాటుగా విమర్శించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.