FbTelugu

రిజిష్టర్ చేసుకున్నా… సెక్యురిటీ కోడ్ చెబితేనే…

న్యూఢిల్లీ: వ్యాక్సిన్ల దుర్వినియోగం అరికట్టేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ చర్యలు తీసుకున్నది. పలువురు వ్యాక్సిన్ కోసం పోటెత్తడంతో కేంద్రాల వద్ద రద్దీ ఏర్పడుతోంది. కోవిన్ ఫోర్టల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తరువాత కేంద్రాలకు వెళ్లకున్నా వేసినట్లు గా చూపిస్తున్నారు.

ఇలా ఆరోగ్య కేంద్రాలు లేదా ఆసుపత్రులకు వెళ్లకుండ ఉన్నవారి వ్యాక్సిన్లు దారి మళ్లితున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ గుర్తించింది. కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టింది. కోవిన్ ఫోర్టల్ లో సరికొత్త ఆఫ్షన్ తీసుకువచ్చింది. ఫోర్టల్ లో పేరు నమోదు చేసుకుని, స్లాట్ బుక్ చేసుకున్న తరువాత రిజిస్టర్ మొబైల్ కు నాలుగు అంకెల సెక్యురిటీ కోడ్ వస్తుంది. వ్యాక్సిన్ తీసుకునేందుకు వెళ్లిన సమయంలో ఆ నెంబర్ చెబతేనే ఇస్తారు, లేదంటే వాపస్ పంపిస్తారు. సెక్యురిటీ పరమైన లోపాలు, వ్యాక్సిన్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఈ విధానం అవలంభిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.