FbTelugu

ఈ-పాస్‌ ఉంటేనే తెలంగాణలోకి..

తెలంగాణ-ఏపి బార్డర్ లో వాహనాల నిలిపివేత
హైదరాబాద్: తెలంగాణ-ఏపి సరిహద్దులో వాహనాలను నిలిపివేస్తున్నారు. ఈ పాస్, అంబూలెన్స్ వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. పోలీసు వాహనాలను సైతం తెలంగాణలోకి అనుమతించడం లేదు. దీంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.

కర్నూలు నగర శివారు పుల్లూరు టోల్ ఫ్లాజా, కృష్ణా జిల్లా గరికపాడు, సూర్యాపేట జిల్లా రామాపురం చెక్‌పోస్టుల వద్ద ఏపీ నుంచి వచ్చే వాహనాలు నిలిచిపోయాయి. అనుమతి పత్రాలు లేకుండా ఏపీ నుంచి వచ్చే వాహనాలను తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి దృష్ట్యా అంతర్రాష్ట్ర సరిహద్దులో ఇవాళ్టి నుంచి ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నారు. ఏపి నుంచి వచ్చే వాహనాలను కోదాడ, పుల్లూరు చెక్ పోస్టుల మీదుగా మాత్రమే తెలంగాణలోకి అనుమతిస్తామని.. మఠంపల్లి, పులిచింతల చెక్‌పోస్టులను మూసివేసినట్లు పోలీసులు ప్రకటించారు. కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, నెల్లూరు, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన వారు కోదాడ మీదుగా, రాయలసీమ ప్రాంతాల వారు పుల్లూరు చెక్ పోస్టు మీదుగా రావాలని తెలంగాణ పోలీసులు ఏపి వాహనదారులకు సూచించారు. ఈ ఆంక్షలు 24 గంటలూ అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. కర్ఫ్యూ మినహాయింపు వేళలు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల అనుమతించడం లేదని తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.