FbTelugu

అలా చేస్తే.. వైరస్‌ ఆగదు!

నిరోధించడానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయంటూ తప్పుడు సమాచారం సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. చైనాలోని జాన్‌జాన్‌ యూనివర్సిటీకి చెందిన ఒక పరిశోధకుడు చెప్పాడంటూ… ఈ వైరస్‌ నుంచి రక్షించుకోవడానికి సాధ్యమైనంత ఎక్కువ మోతాదులో విటమిన్‌-సి తీసుకోవాలని సూచిస్తున్న కథనం ప్రచారంలో ఉంది. వైరల్‌ మేగజీన్‌.ఇట్‌ అనే న్యూస్‌ పోర్టల్‌లో ఇది ప్రచురితమైంది. ఆ కథనాన్ని సోషల్‌ మీడియాలో 5,76,000 సార్లు చూశారట.
నిమ్మరసం కలిపిన వేడినీళ్లు తాగితే వైరస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చునని బీజింగ్‌ మిలటరీ హాస్పిటల్‌ సిఇఓ ప్రొఫెసర్‌ చెస్‌ హోరిన్‌ చెప్పారని కూడా ఆ పోస్ట్‌ ఉటంకిస్తోంది.

కానీ… ఇందులో చాలా విషయాలు నమ్మశక్యం కానివిగా వున్నాయి. చైనా రీసెర్చర్‌ అంటూ చెప్పిన పేరు నకిలీదిగా కనిపిస్తోంది. ఎందుకంటే ఆ పేరును ఇంగ్లీష్‌లోకి అనువదిస్తే ‘నీ పేరు ఏమిటి?’ అనే అర్థం వస్తుంది. ఇక చైనాలో జాన్‌జాన్‌ యూనివర్సిటీ అనేది ఏదీ లేదు. ఇక్కడ ప్రస్తావించిన ప్రొఫెసర్‌ పేరు గతంలోనూ క్యాన్సర్‌కు సంబంధించి వచ్చిన తప్పుడు సలహాల్లో కూడా కనిపించింది.@@
ఇదీ సత్యం: నిమ్మరసం కానీ, విటమిన్‌-సి ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల కానీ వైరస్‌ సోకకుండా నివారిస్తుందనేందుకు ఎటువంటి శాస్త్రీయమైన ఆధారాలూ లేవు. వైరస్‌తో పాటు నిమ్మరసం కేన్సర్‌ నివారిణిగా పనిచేస్తుందనే ప్రచారం సోషల్‌ మీడియాలో జరుగుతున్నది. ఇందులో ఏమాత్రం నిజం లేదని నిపుణులు చెబుతున్నారు.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More