FbTelugu

దమ్ముంటే ఉత్త‌మ్ చర్చలకు రావాలి: జగదీశ్ రెడ్డి

సూర్యాపేట: టీపీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ దమ్ముంటే హుజూర్ నగర్ అభివృద్ధిపై చర్చలకు రావాలంటూ.. రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి సవాల్ విసిరారు. ఇవాళ హుజూర్‌ న‌గ‌ర్ మార్కెట్ క‌మిటీ పాల‌క‌వ‌ర్గం ప్ర‌మాణ‌ స్వీకార కార్య‌క్ర‌మంలో ఆయన పాల్గొన్నారు.

మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్‌గా క‌డియం వెంక‌ట‌రెడ్డి ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. అనంతరం జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి కార్య‌క్ర‌మాలు ఎక్కువైనాయని అన్నారు. ఉత్త‌మ్ కుమార్ రెడ్డి మాట మీద నిల‌బ‌డే వ్య‌క్తి కాద‌న్నారు. మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, రాజ్య‌స‌భ స‌భ్యుడు బ‌డుగుల లింగ‌య్య యాద‌వ్ పాల్గొన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.