FbTelugu

బీజేపీని తిడితే… కేసీఆర్ ను తిడతా: బండి సంజయ్

వరంగల్: కేసీఆర్ సంస్కారవంతుడు అయితే నిను సంస్కారుడినే. నన్ను సంస్కార హీనుడు అంటే.. సీఎం కేసీఆర్ కూడా సంస్కార హీనుడేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.

దేశంలో కరోనా వైరస్ కు వ్యాక్సిన్ కనుగొంటే .. తెలంగాణ లో మాత్రం ప్రజలు కరప్షన్ వ్యాక్సిన్ ను కనుగొన్నారు. పీఆర్సీ పేరుతో ప్రభుత్వ ఉద్యోగులను కేసీఆర్ మోసం చేస్తున్నారని, ఉద్యోగులు గమనించాలని ఆయన పిలుపునిచ్చారు. హరితహారం పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని, తమకు అటవీ శాఖ ఉద్యోగులే సమాచారం ఇస్తున్నారని సంజయ్ తెలిపారు.

బీజేపీ పార్టీ లో అందరి నిర్ణయాలకు గౌరవం ఉంటుందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ కోట్లు ఖర్చు పెట్టి గెలవాలని చూస్తుంది. దానికోసం వ్యూహాలను సిద్ధం చేస్తోందన్నారు. దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రజలు తీర్పుతో ట్రయల్ రన్ చేశారన్నారు. వచ్చే వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు యువత, విద్యావంతులు కరప్షన్ వ్యాక్సిన్ ప్రయోగిస్తారని సంజయ్ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వరంగల్ కార్పొరేషన్ అభివృద్ధి కి కేంద్రం ఇచ్చిన నిధులను కేసీఆర్ దారి మళ్లించారన్నారు. వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్లను అభివృద్ధి చేయడానికి స్మార్ట్ సిటీ పధకం ఇచ్చామని, ఎక్కడా ఖర్చు పెట్టలేదన్నారు. అభివృద్ధి పై చర్చకు రమ్మంటే… పారిపోయి చర్చను పక్కదారి పట్టిస్తున్నారని సంజయ్ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో వరంగల్ జిల్లా మేధావి వర్గమే ఉద్యమాన్ని ఉధృతం చేసిందన్నారు. 

You might also like

Leave A Reply

Your email address will not be published.