దక్షిణాది సినిమారంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ.. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. తెలుగు, తమిళ అగ్రహీరోల సరసన కూడా నటించారు. తాజాగా తాప్సి తన మనో గతాలను పంచుకున్నారు. ఎవరైనా తనగురించి తప్పుగా మాట్లాడితే నచ్చదని అన్నారు.
తనకు సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటానని తెలిపారు. కొందరు కావాలనే తనని ట్రోల్ చేస్తారని వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించనని.. వారికి తగ్గట్టుగా కౌంటర్ ఇవ్వనున్నట్టు తెలిపారు. తన జీవితానికి సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకోవడం ఇష్టమని తెలిపారు.