FbTelugu

‘అక్రిడిటేష‌న్‌ కమిటీలో వారికే చోటులేకపోవడం వింత’

అమరావతి: అక్రిడిటేష‌న్‌ కమిటీలో జ‌ర్న‌లిస్టులు, జ‌ర్న‌లిస్టు సంఘాల‌కు చోటు లేక‌పోవ‌డం వింత‌ల్లోకెల్లా వింత‌ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకెశ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ వేదికగా పలు వ్యాఖ్యలు చేశారు. ‘‘చేసిందే చ‌ట్టం, ఇచ్చేదే జీవోగా జగన్ స‌ర్కారు వ్య‌వ‌హ‌రిస్తోంది.

జీఓ నెంబర్ 2430 తెచ్చి మీడియా గొంతు నొక్కారు. జీవో 142 తెచ్చి పాత్రికేయుల‌కు ఉన్న ఒకే ఒక సౌక‌ర్యం అక్రిడిటేష‌న్ పీకేశారు. అక్రిడిటేష‌న్‌ కమిటీలో జ‌ర్న‌లిస్టులు, జ‌ర్న‌లిస్టు సంఘాల‌కు చోటు లేక‌పోవ‌డం వింత‌ల్లోకెల్లా వింత‌. టీడీపీ హ‌యాంలో ఇచ్చిన అక్రిడిటేష‌న్ల‌లో 10 శాతం కూడా ఇవ్వ‌డంలేదు.

జీవోని అడ్డుపెట్టుకుని త‌న మీడియా వారికే అక్రిడిటేష‌న్లు ఇచ్చి. మిగిలిన జ‌ర్న‌లిస్టులంద‌రి మొండిచేయి చూప‌డం చాలా దారుణం. అక్రిడిటేష‌న్ జ‌ర్న‌లిస్టుల హ‌క్కు. ప‌నిచేసే జ‌ర్న‌లిస్టులంద‌రికీ అక్రిడిటేష‌న్ ఇవ్వాల‌ని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది.’’ అంటూ ట్వీట్ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.