FbTelugu

విశాఖలో భూమి ఆక్రమిస్తే స్వాధీనం తప్పదు: వీవీఎస్

విశాఖపట్నం: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంద్రప్రదేశ్ లో కరోనా నియంత్రణకు ముఖ్యమంత్రి వైఎస్. జగన్ రెడ్డి తగు చర్యలు తీసుకుంటున్నారని వైసీపీ ఎంపీ  వి.విజయసాయిరెడ్డి అన్నారు.

కరోనా విషయం లో ప్రజలు జాగ్రత్త వహించాలి, లక్షణాలు కన్పించిన వెంటనే సమీప ఆసుపత్రికి వెళ్లాలని కోరారు. దేశంలో ఎక్కడ లేని విధంగా పెద్ద ఎత్తున టెస్టులు చేయిస్తున్నామన్నారు. కరోనాపై ఎటువంటి జాగ్రత్తలో తీసుకోవాలో పుస్తక రూపంలో ప్రచురించామని విజయసాయి రెడ్డి తెలిపారు. వాలంటీర్లు ద్వారా ప్రతి ఇంటికి ఈ పుస్తకం చేరాలన్నారు.

విశాఖ పరిపాలన రాజధానిగా మారనున్న నేపధ్యంలో భూములు రేట్లు బాగా పెరిగాయన్నారు. ప్రభుత్వ భూమిని ఎవరూ ఆక్రమించినట్లు తెలిసినా ప్రజలు వెంటనే  అధికారులకు తెలియజేయాలన్నారు. భూ ఆక్రమణలకు పాల్పడితే ఎంత పెద్ద వారినైనా కఠిన చర్యలు తీసుకుంటామని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. అక్రమణదారుల నుంచి  భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందన్నారు.

 

You might also like