FbTelugu

కరాచీ కలిస్తే… ఆ రెండూ కలిపితే ఒకే: ఎన్సీపీ

ముంబై: పాకిస్థాన్ లోని కరాచీ ఇండియాలో కలిసిపోయే రోజు వస్తుందని మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ప్రకటించడాన్ని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) స్పందించింది.

బంగ్లాదేశ్, పాకిస్థాన్ లు కూడా ఇండియాలో విలీనం కావాలని ఆశిస్తున్నామని ఎన్సీపీ నేత మంత్రి నవాబ్ మాలిక్ అన్నారు. బెర్లిన్ గోడ కూలిపోయింది, అలాంటిది బంగ్లాదేశ్, పాకిస్థాన్ లు ఎందుకు కలవవు అని ఆయన ప్రశ్నించారు. ఈ రెండు దేశాలను తమ దేశంలో విలీనం చేయాలని బీజేపీ ప్రతిపాదిస్తే తాము కచ్చితంగా స్వాగతిస్తామని ఆయన అన్నారు.
ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో శివసేనతో కలిసి పోటీ చేస్తామని, ఇందులో ఏమాత్రం సందేహించాల్సింది లేదన్నారు. బృహణ్ ముంబై ఎన్నికలకు మరో 18 నెలల గడువు ఉందని , ఎవరికి వారుగా తమ పార్టీ బలాలను పెంచుకుంటారని నవాబ్ వెల్లడించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.