FbTelugu

హైదరాబాద్ ఆగమైతే… తెలంగాణ గోవిందా: కేటిఆర్

ఆరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి ని సాధించిందని, ఇన్ని సంవత్సరాల్లో ఎలాంటి గొడవలు జరగలేదు, రాష్ట్రమంతటా ప్రజలందరు కలిసిమెలిసి ఉన్నారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు అన్నారు.
ఇవ్వళ రోడ్డు షో లో భాగంగా అల్లాపూర్, నర్సాపూర్ ఎక్స్ రోడ్డు ప్రాంతాల్లో ఆయన స్థానికులను ఉద్దేశించి ప్రసంగించారు. మంచినీళ్లు, కరెంట్ సమస్యను పరిష్కరించుకున్నామని, గతంలో కరెంట్ ఉంటే వార్త, నేడు అది పోతే వార్త అని అన్నారు. పేకాట క్లబ్ లు లేదు, గుడుంబా గబ్బు లేదు, పోకిరీల ఆటలు లేవన్నారు. సున్నం చేరువును బాగు చేసుకుంటున్నామని, జీవో 58,59 ద్వారా భూ యాజమాన్య పట్టాలు ఇస్తున్నామని కేటీఆర్ చెప్పారు.

నగరంలో ఐదు లక్షల సిసి కెమెరాలు పెట్టుకున్నాము, వాటిని పది లక్షలు చేద్దామన్నారు ఇప్పుడు కొత్త బిచ్చగాళ్ల బయలుదేరారు. తాగి బండి నడపండి, ఛాలాన్ లను బల్దియా కడుతాది అంటున్నారు. వరద సాయం ఆపారు… వారు వస్తే రూ.25 వేలు ఇస్తామంటున్నారు. మేము చేసిన వంద పనులను చూపిస్తాము… కేంద్రం నగరంలో చేసిన ఒక్క పనిని చూపిస్తారా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. చార్మినార్ కాడా ధర్నా చేశారు.. అక్కడ కావాలనే ధర్నా చేశారు. హిందూ ముస్లిం గొడవలు పెట్టాలని చూస్తున్నారు. ఎలాంటి హైదరాబాద్ కావాలో మీరే ఆలోచించండి. హైదరాబాద్ ఆగమైతే తెలంగాణ ఆగమైతదని కేటీఆర్ ఆందళన వ్యక్తం చేశారు.
నగరం బాగుంది కాబట్టే గూగుల్, ఆపిల్ కంపెనీలు వచ్చాయి. గొడవలు ఉంటే అవి వచ్చేవి కావన్నారు. అభివృద్ధి కావాలా….అరాచకం కావాలో ఆలోచించండి. ఈసారి సెంచరీ కొడతాము, అది అల్లాపూర్, ముసాపేట్ నుండే మొదలుకావాలని కేటీఆర్ కోరారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.