FbTelugu

24 గంటల్లో వలస కూలీలను గుర్తించాలి

అమరావతి: వలస కూలీల సమస్యలపై సీపీఐ ఎపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ నమోదు చేసిన పిటిషన్ ను ఇవాళ హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా హైకోర్టు పలు ఆదేశాలు జారీ చేసింది. 24 గంటల్లో వలస కూలీలను గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

గుర్తించి వారికి ఆహారం, మెడిసిన్ ను వెంటనే అందించాలని ఆదేశించింది. పిటిషన్ లో సీపీఐ రామకృష్ణ వలస కూలీలకు ప్రభుత్వం రూ.10 వేలు నగదు సాయం చేయాలని కోరారు.

You might also like