FbTelugu

అఖండ మూవీ ఈవెంట్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథి…

నందమూరి నటసింహ బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ అఖండ మీద ఎంతటి అంచనాలున్నాయో అందరికీ తెలిసిందే. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్, పాటలతో అందరికీ అంచనాలు పెరిగాయి. మొత్తానికి డిసెంబర్ 2న ఈ చిత్రం రాబోతోంది. ఈ క్రమంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను పెంచేశారు.

తాజాగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించిన అప్టేట్ ఇచ్చారు. నవంబర్ 27న శిల్పా కళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోందని ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రాబోతోన్నట్టు మేకర్లు ప్రకటించారు.

బాలకృష్ణతో అల్లు అర్జున్‌కు మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ మధ్యే ఆహాలో ఓ కొత్త షోను ప్రారంభించారు. ఆ టాక్ షోలో బాలయ్య అదరగొట్టేస్తున్న సంగతి తెలిసిందే. అలా అల్లు నందమూరి బంధం మరోసారి తెర మీదకు వచ్చింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.