FbTelugu

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బుల్లితెర‌పై సంద‌డి….

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాల్లోనే కాకుండా సీనియ‌ర్ హీరోల‌ను ఫాలో అవుతూ బుల్లితెర‌పై సంద‌డి చేయ‌బోతున్నారా? అనే సందేహం వ‌స్తుంది. అయితే అందులో నిజం లేదు. అస‌లు విష‌య‌మేమంటే.. బుల్లితెర‌పై బ‌న్నీ సంద‌డి నిజ‌మే. అయితే హోస్ట్‌గా కాదండోయ్‌.. గెస్ట్‌గా మాత్ర‌మే.

అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాల్లోనే కాకుండా సీనియ‌ర్ హీరోల‌ను ఫాలో అవుతూ బుల్లితెర‌పై సంద‌డి చేయ‌బోతున్నారా? అనే సందేహం వ‌స్తుంది. అయితే అందులో నిజం లేదు. అస‌లు విష‌య‌మేమంటే.. బుల్లితెర‌పై బ‌న్నీ సంద‌డి నిజ‌మే. అయితే హోస్ట్‌గా కాదండోయ్‌.. గెస్ట్‌గా మాత్ర‌మే. ఇంత‌కీ ఏ షోకు అల్లు అర్జున్ గెస్ట్‌గా వెళ్లారో తెలుసా? ఢీ 13 డాన్స్ షోకు. ఈటీవీలో మ‌ల్లెమాల వాళ్లు నిర్వ‌హిస్తున్న ఈ డాన్స్ షోకు చాలా మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. ఇప్ప‌టికే 12 సీజ‌న్స్ పూర్తి చేసుకుని 13వ సినిమా సీజ‌న్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. డీ 13 షో ఫైన‌ల్స్‌కు అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్‌గా వ‌చ్చారు. దానికి సంబంధించిన ప్రోమో కూడా విడుద‌లైంది. పుష్ప ది రైజ్ చిత్రంలో ‘ఏ బిడ్డా ఇది నా అడ్డా..’ అనే సాంగ్‌కు డానర్స్ స్టెప్స్ వేస్తుండ‌గా బ‌న్నీ ఎంట్రీ ఇచ్చారు. వారితో పాటు ఆయ‌న కూడా స్టెప్పులేయ‌డం విశేషం. త్వ‌ర‌లోనే ఢీ 13 ఫైన‌ల్ ఎపిసోడ్స్ ప్ర‌సారం కానుంది. శేఖ‌ర్ మాస్ట‌ర్‌, ప్రియ‌మ‌ణి, పూర్ణ ఈ షోకు న్యాయ నిర్ణేత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఢీ 13లో కింగ్స్ వ‌ర్సెస్ క్వీన్స్ మ‌ధ్య పోటీలో ఎవ‌రు విజేత‌లో త్వ‌ర‌లోనే తెలియ‌నుంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.