FbTelugu

కరోనా పరీక్షలపై ఐసీఎంఆర్ మార్గదర్శకాలు

అమరావతి: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో భారత వైద్య పరిశోధనా మండలి (ఐసిఎంఆర్) టెస్టింగ్ విధానాలపై కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.

ఐసిఎంర్ కొత్త మార్గదర్శకాల ప్రకారం ఇన్ ఫ్లుయెంజా (దగ్గు, జలుబు) లాంటి అనారోగ్యపు లక్షణాలు ఉన్నా కూడా కరోనా పరీక్షలు నిర్వహించాలని సూచించింది.  కరోనా పరీక్షల కేటగిరీలను మరింత పెంచిందని కోవిడ్-19స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీకాంత్ అర్జా తెలిపారు.

ఈ క్రింది లక్షణాలు ఉన్నవారందరికి ఇకనుంచి కరోనా పరీక్షలు నిర్వహించాలని ఐసిఎంఆర్ రాష్ట్రాలకు సూచించిందని ఆయన పేర్కొన్నారు. అంతే కాకుండా కరోనా టెస్టులు చేయడం లేదని తెలిస్తే, అనుమానితులకు అత్యవసర వైద్యం అందించాలని ఐసీఎంఆర్ సూచించింది.

 

– 14 రోజుల క్రితం విదేశాల నుంచి వచ్చిన వారిలో ఇన్ ఫ్లుయెంజా (దగ్గు, జలుబు) తరహా లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు చేయాలి.

 

– కరోనా నిర్ధారణ అయిన వ్యక్తులను కలిసిన వారిలో ఇన్ ఫ్లూయెంజా వంటి లక్షణాలు ఉన్నవారందరికీ టెస్టులు చేయాలి.

 

– కరోనాపై పోరాడుతున్న వైద్య, ఆరోగ్య, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులలో ఇన్ ఫ్లుయెంజా తరహా లక్షణాలతో బాధపడుతున్న వారు ఉన్నారు.

 

– తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారిని కూడా గుర్తించాలి.

 

– కరోనా నిర్ధారణ అయిన వ్యక్తిని నేరుగా కలిసినవారికి, కరోనా లక్షణాలు లేనివారికీ పరీక్షలు చేయాలి.

 

– హాట్ స్పాట్లు, కంటైన్మెంట్ జోన్లలో ఇన్ ఫ్లుయెంజా తరహా లక్షణాలున్న వారికి.

 

– ఇన్ ఫ్లుయెంజా తరహా లక్షణాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందేవారు.

 

– వలస కార్మికుల్లో ఏడు రోజులుగా ఇన్ ఫ్లుయెంజా లక్షణాలతో బాధపడుతున్నా పరీక్షించాలి.

You might also like