FbTelugu

ఐసిసి టి 20 ప్రపంచ కప్ షెడ్యూల్

దుబాయ్: ఐసిసి టి20 ప్రపంచ కప్ టోర్నీ నిర్వహణ తేదీలను ప్రకటించింది. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు నిర్వహించనున్నట్లు ఐసిసి ట్విట్ చేసింది.
ఐసిసి టి20 ప్రపంచ కప్ టోర్నీ మ్యాచులను యుఏఈ తో పాటు ఒమన్ లో నిర్వహించనున్నారు. భారత్ లో కరోనా సెకండ్ వేవ్ పరిణామాలతో టోర్నీ నిర్వహణ వేదికలను మార్చాల్సి వచ్చింది.

అయితే బిసిఐ ఆతిథ్యంలోనే ఈ టోర్నీ మొత్తం జరగనున్నదని ఐసిసి స్పష్టం చేసింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం, ద షేక్ జాయెద్ స్టేడియం (అబుదాబి), షార్జా స్టేడియం, ఒమన్ క్రికెట్ అకాడెమీ గ్రౌండ్ లో మ్యాచులు జరగనున్నాయి. తొలి రౌండ్ లో అర్హత సాధించిన 8 జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి ఒమన్, యుఏఈ దేశాల్లో రెండు గ్రూపులు మ్యాచులు ఆడనున్నాయి. ఈ జట్ల నుంచి నాలుగు టీమ్ లు సూపర్ 12కు ఎంపికవుతాయి. ఈ 8 జట్లు ఆటోమెటిక్ క్వాలిఫైయర్స్ తో కలుస్తాయని ఐసిసి ట్వీట్ చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.