FbTelugu

తెలుగు ఐఏఎస్‌ కోట రవి కు కీలక పదవి

అమెరికాలో భారత ప్రత్యేక ఆర్థిక దౌత్యవేత్తగా సంతబొమ్మాళి మండలం, కోటపాడు గ్రామానికి చెందిన ఐఏఎస్ అధికారి కోట రవి నియమితులయ్యారు.

వాషింగ్టన్‌లోని రాయబార కార్యాలయంలో సంయుక్త కార్యదర్శి హోదాలో ఎకనమిక్‌ మినిస్టర్‌గా విధులు నిర్వహించనున్నారు. మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్న రవి కు భారత్ తరపున ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు.

కాగా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా కోటపాడు గ్రామానికి చెందిన రవి కోట 1993 బ్యాచ్‌ అసోం మేఘాలయ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. గత రెండున్నరేళ్లుగా 15వ ఆర్థిక సంఘం సంయుక్త కార్యదర్శిగా విధులు నిర్వహించారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్‌ నియామకాల కమిటీ గురువారం ఆయనకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.

సంతబొమ్మాళి మండలం, కోటపాడు కొత్తూరు ప్రభుత్వ పాఠశాలలో రవి ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుకున్నారు. 6వ తరగతి నుంచి పదవ తరగతి వరకు దండు గోపాలపురం జిల్లా పరిషత్ హైస్కూల్లో, ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు టెక్కలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పూర్తి చేసుకున్నారు. డిగ్రీ టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, ఎన్ జి రంగా యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కళాశాల బాపట్ల లో బీఎస్సీ, ఎమ్మెస్సీ, పి హెచ్ డి ఐ ఆర్ ఐ న్యూఢిల్లీ, పూర్తి చేశారు.

993లో ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన రవి అసోం రాష్ట్రంలో జొరహాట్, గోలాఘాట్, దిమ్నగర్ ప్రాంతాలలో లో జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహించారు. అసోం రాష్ట్రానికి అగ్రికల్చర్ సెక్రటరీగా కొద్దిరోజులు, ఫైనాన్స్ సెక్రటరీగా విధులు నిర్వహించారు. న్యూఢిల్లీలో మానవ వనరుల శాఖ లో సెక్రటరీగా చేశారు. ఇప్పుడు 15 వ ఫైనాన్స్ జాయింట్ సెక్రటరీగా చేస్తున్నారు. కేంద్ర గనుల శాఖ మంత్రికి ఓఎస్డీ గా చేశారు. ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, అండమాన్ రాష్ట్రాలకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేనేజర్ గా విధులు నిర్వహించారు. ఈయనకు అమెరికా ఎంబసీలో కీలక పదవి లభించడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.

You might also like