FbTelugu

కోర్టులో వారి సంగతి తేల్చుతా: నటి రాధిక

చెన్నై: గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా, ఆన్ లైన్ లో తన ఆరోగ్యం గురించి అబద్దపు ప్రచారం చేస్తున్నారని, అసత్య ప్రచారం చేసేవరిపై కోర్టుకు వెళ్తున్నట్లు నటి రాధికా శరత్ కుమార్ స్పష్టం చేశారు.

కరోనా బారినపడినట్లు కొది రోజులుగా ఆన్ లైన్ లో, సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్న నేపథ్యంలో రాధిక స్పందించారు. తనకు కరోనా సోకలేదని, వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న తరువాత ఒళ్లు నొప్పులు వస్తున్నాయని రాధికా ఇవాళ ట్వీట్ చేశారు. ఆరోగ్యంగానే ఉన్నానని, నటనలో బిజీగా ఉన్నట్లు తెలిపారు. అయితే తన ఆరోగ్యం గురించి వదంతులు పుట్టిస్తూ అయోమయానికి గురి చేస్తున్నారు. ఇలాంటి పుకార్లను వ్యాప్తి చేస్తున్న వారిపై కోర్టులో పోరాటం చేస్తానని రాధిక హెచ్చరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.