FbTelugu

అముల్ ను బలోపేతం చేస్తాను: సీఎం జగన్ రెడ్డి

అమరావతి: నా పాదయాత్రలో పాడి రైతుల కష్టాలను నేను చూశానని, అధికారంలోకి వచ్చాక సహకార సొసైటీలను బలోపేతం చేస్తానని హామీ ఇచ్చాననని సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి తెలిపారు.

గుజరాత్ కు చెందిన అమూల్ తో ఒప్పందం వల్ల పాడి రైతులకు మేలు జరుగుతుందని, మార్కెట్లో పోటీతత్వం ఉంటేనే రైతులకు ఎక్కువ మేలు జరుగుతుందని జగన్ అన్నారు. ప్రపంచంలో అమూల్ సంస్థ 8వ స్థానంలో ఉండడంగ గర్వకారణంగా ఉందన్నారు. ఇవాళ సచివాలయంలోని మొదటి బ్లాక్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎ జగన్ ఏపీ అముల్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఏపీ అముల్ వెబ్ సైట్, డ్యాష్ బోర్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమూల్ కు వచ్చే లాభాల్లో ఏడాదికి రెండు సార్లు బోనస్ రూపంలో మహిళలకే ఇస్తుందన్నారు. తొలి దశలో 7 వేల యూనిట్ల పాడి పశువుల పంపిణీ, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో లక్ష యూనిట్లు, ఆగస్టులో 3 లక్షల యూనిట్ల పంపిణీ చేస్తామని సీఎం వివరించారు.

మహిళలకు శాశ్వత ఆదాయం ఉండేలా ఈ ప్రాజెక్టును చేపట్టామని, లీటరుకు రూ. 5 నుంచి 7 వరకు పాడి రైతులకు ఆదాయం కలుగుతుందన్నారు. పాలు సేకరించిన 10 రోజులలోపే పాడి రైతుల అకౌంట్లో నేరుగా డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నారు. నేటి నుండి చిత్తూరు జిల్లాలో పాల సేకరణ ప్రారంభం అయ్యిందని, తొలిదశలో 400 కేంద్రాలలో పాల సేకరణ జరుగుతుందని సీఎం వెల్లడించారు. రాబోయే రోజులలో గ్రామాల యొక్క స్వరూపాలు మారబోతున్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,899 గ్రామాలలో పాలసేకరణ, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ లు ఏర్పాటు చేస్తున్నామని సీఎం జగన్ రెడ్డి తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.