FbTelugu

వాళ్ళ పని చేస్తా: మమత వార్నింగ్

కొలకతా: అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయాన్ని జీర్ణించుకోలేని బిజెపి నాయకులు పాత అల్లర్లకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారని సిఎం మమతా బెనర్జీ మండిపడ్డారు.
ఇలా చేయడం బిజెపికి అలవాటేనని, తమకు హింస అంటే ఏమాత్రం ఇష్టముండదని ఆమె స్పష్టం చేశారు. ఓడిపోయిన తరువాత బిజెపి ఇలా ఎందుకు చేస్తున్నదో తనకు అర్థం కావడం లేదని అన్నారు. రాష్ట్రంలో ఎన్నికల కారణంగా వాతావరణం వేడెక్కిందని, బిజెపితో పాటు కేంద్ర భద్రతా బలగాలు అనేక దుశ్చర్యలకు దిగాయని ఆమె ఆరోపించింది. అయినప్పటికీ మీరు హింస వైపు వెళ్లకండి, శాంతిని కాపాడండి అని మమతా పిలుపునిచ్చారు. కొందరు బిజెపి కోసం పనిచేశారు. వారి భరతం పడతానని ఆమె తీవ్రంగా హెచ్చరించారు. బిజెపికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ఉద్యుక్తుల్ని చేస్తానని, ఒక్కరూ ఏదీ చేయలేరని మమత వ్యాఖ్యానించింది.
ఎన్నికలు పూర్తయ్యాయి, గెలచాం, ఇక మనం కరోనా పై పోరాటం చేయాలని పిలుపునిచ్చింది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం వెంటనే రూ.30వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కేంద్రం తమకు నచ్చిన రాష్ట్రాలకు ఆక్సిజన్ పంపుతూ, మిగతా రాష్ట్రాలకు మొండి చేయి చూపిస్తున్నదని మమత మండిపడింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.