FbTelugu

ఎవరినైనా నిలదీస్తా: వైసీపీ ఎమ్మెల్యే ఆనం

మాజీ మంత్రి ఆనం వ్యాఖ్యలో అంతరార్థం?

నెల్లూరు: ప్రజల కోసం ఎవరినైనా నిలదీస్తానని, ఇంత అధ్వాన్నపు అధికార యంత్రాంగాన్ని నెల్లూరులో ఎప్పుడూ చూడలేదని వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆరోపించారు.

మంత్రులు, అధికారులు సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి లేఖనే పట్టించుకోవడం లేదని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఏడాది పాలనలో కేకు సంబరాలు తప్ప… నా నియోజకవర్గంలో అభివృద్ధి మాత్రం శూన్యం అని అన్నారు. రాష్ట్ర, జిల్లాస్థాయి యంత్రాంగంపై విరుచుకుపడ్డారు.

మరో ఏడాది వేచి చూస్తాను, అప్పటికీ పనులు జరగకపోతే ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వెనుకాడను అని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లాలో జలదోపిడీ లెక్కలు తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు.

రూ.2వేల కోట్ల నిధులు విడుదల చేస్తే ఎస్ఎస్ కెనాల్ కు పైసా విదిల్చలేదన్నారు. జిల్లా అధికారులు వెంకటగిరి నియోజకవర్గాన్ని మర్చిపోయారని అన్నారు. నీటి పారుదల శాఖలో నీళ్లను అధికారులే అమ్ముకుంటున్నారని ఆనం అన్నారు.

You might also like