FbTelugu

ఆ అందగత్తె గురించి మాట్లాడను: ఉద్ధవ్ థాకరే

ముంబై: బాలీవుడ్ వివాదాస్పద నటీమణి కంగనా రనౌత్ గురించి మాట్లాడేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నిరాకరించారు. ఆమె ఆరోపణలపై తాను మాట్లాడబోనని, అంతగా ఆలోచించే సమయం కూడా లేదని ఆయన స్పష్టం చేశారు.

శివసేన పత్రిక సామ్నా ఎడిటర్ సంజయ్ రౌత్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉద్ధవ్ మాట్లాడుతూ, ఆమె విషయంపై మాట్లాడడానికి తనకు సమయం కూడా లేదని అన్నారు.  ముంబై నగరానికి వ్యతిరేకంగా కంగనా చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని సంజయ్ కోరగా, ఇది ముంబై వాసులకు అవమానకరం, దీనిపై రాజకీయాలు చేయాలని కొందరు కోరుంటున్నారన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.