FbTelugu

అప్పుడే వైట్ హౌస్ వీడతా: ట్రంప్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పంతం వీడడం లేదు. ఎవరు ఎంతగా మొత్తుకుంటున్నా, కుటుంబ సభ్యులు చెబుతున్నా… మళ్లీ పాత పాటే పాడుతున్నాడు. ఎలక్టోరల్ కాలేజీలో జోసెఫ్ బైడెన్ తన ఆదిక్యాన్ని నిరూపించుకుంటేనే వైట్ హౌస్ నుంచి బయటకు వెళ్తానని స్పష్టం చేశారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో ట్రంప్ పై జోసెఫ్ ఆర్.బైడెన్ విజయం సాధించిన విషయం తెలిసిందే. విజయం సాధించడంతో ప్రభుత్వ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. కీలక వ్యక్తులను నియమించుకుంటూ తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ మాత్రం తాను తగ్గేది లేదంటూ మాట్లాడుతున్నారు. ఓటమిని ఎంతమాత్రం అంగీకరించడం లేదు. ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని, ఒక వర్గం మీడియా తనను టార్గెట్ చేసిందని ఆరోపించారు.

ట్విటర్ కూడా ట్రెండింగ్ లోని అంశాన్ని ట్రెండ్ చేసి తనను అభాసుపాలు చేసిందన్నారు. తన ఓటమి కోసం చైనా మొదలు అందరూ కుట్ర చేశారని ట్రంప్ ఆరోపించారు. ఎలక్టోరల్ కాలేజీలో జోసెఫ్ ఆర్.బైడెన్ తన ఆధిక్యాన్ని నిరూపించుకున్న తరువాతే తను వైట్ హౌస్ ను వీడతానని ట్రంప్ శపథం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.