FbTelugu

కిస్ పెడతా… అడ్డుకోండి! పోలీసులపై మహిళ హల్ చల్

న్యూఢిల్లీ: మీ ముందే నా భర్తను గట్టిగా ముద్దు పెట్టుకుంటా… నన్ను ఆపుతారా అంటూ ఒక మహిళ పోలీసులపై హల్ చల్ చేసింది. ఎట్లా అడ్డుకుంటారో చూస్తానంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగింది.

ఈ ఘటన ఆదివారం సాయంత్రం దరియాగంజ్ ప్రాంతంలో చోటు చేసుకున్నది. ఢిల్లీకి చెందిన భార్యభర్తలు తమ కారులో రోడ్డుపై వెళ్లున్నారు. ఇద్దరూ మాస్కులు ధరించకుండా వెళ్తుండంతో పోలీసులు కారును ఆపారు. మాస్క్ లేకుండా ఎలా వెళ్తున్నారంటూ పోలీసులు ప్రశ్నించడంతో ఆ మహిళకు కోపం వచ్చింది. కారులో ఒకరు వెళ్లినా, ఇద్దరు ప్రయాణించినా మాస్కు పెట్టుకోవాల్సిందేనని స్పష్టం చేయడంతో ఆమెకు చిరాకు తెప్పించింది. ఇంకేముంది కారులో నుంచి దిగి పోలీసులతో వాగ్వాదానికి దిగింది.

మీ అందరి ముందే నా భర్తను ముద్దు పెట్టుకుంటాను. నన్ను ఆపగలరా అంటూ పోలీసులను నిలదీసింది. నా భార్యతో కారులో వెళ్తుంటే ఎందుకు ఆపారంగూ భర్త ప్రశ్నించారు. పద్దతి లేకుండా వ్యవహరించడం, పోలీసులను దూషించడంతో కారు యజమాని పంకజ్ దత్తా పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు అరెస్టు చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.