FbTelugu

మరో జన్మలో మేయర్ కుక్కగా పుడతాను: ఆర్జీవి

హైదరాబాద్: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో జన్మంటూ ఉంటే గ్రేటర్ హైదరాబాద మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ కుక్కగా పుడతానని చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది.

నాలుగైదు రోజుల క్రితం మేయర్ విజయలక్ష్మీ తన కుక్కకు రొట్టే తిన్పిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆమె ఒక చేత్తో కుక్కకు రొట్టె తిన్పిస్తూ మరో చేత్తో తాను అదే రోటి తింటున్న వీడియో సోషల్ మీడియాలో షేర్ అయ్యింది. ఈ వీడియో ను చూసిన రామ్ గోపాల్ వర్మ విభిన్నంగా స్పందించారు. పెంపుడు కుక్కపై మేయర్ ప్రేమ గొప్పగా ఉంది. కుడి చేత్తో రొట్టే తిన్పిస్తూ ఎడమ చేత్తో తాను అదే రొట్టె ముక్కను తింటున్నారు. ఆమెను అంతర్జాతీయ కుక్కల మేయర్ గా ఎంపిక చేయాలి. ఆమె కుక్కపై చూపుతున్న ప్రేమకు ధీటుగా ప్రజలను ప్రేమించగలరా అంటూ ప్రశ్నించారు.

కుక్కను ఆమె అంతగా ప్రేమించడాన్ని చూస్తుంటే మరో జన్మలో నేను కూడా కుక్కగా పుట్టాలని మనసారా కోరుకుంటున్నానని వర్మ వ్యాఖ్యానించారు. ఇంత ప్రేమగా కుటుంబాన్ని, టీఆర్ఎస్ పార్టీని, తెలంగాణ ప్రజలను కూడా ప్రేమిస్తారా అనే అనుమానాలు తనకు కలుగుతున్నాయని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లు పెద్ద చర్చకు తెరలేపాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.