FbTelugu

ఓటు హక్కు కోసం హైకోర్టుకు వెళ్తా: నిమ్మగడ్డ

విజయవాడ: రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు సజావుగా సంతృప్తిగా జరుపుకున్నామని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు.

పదవీ విరమణ సందర్భంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ సహకారంతోనే ఎన్నికలు సజావుగా నిర్వహించామని, ప్రతిభావంతులైన సిబ్బందిని ఇచ్చి నాకు ప్రభుత్వం సహకరించిందన్నారు. వ్యక్తుల అనాలోచిత చర్యల వల్ల వ్యవస్ధల మధ్య అంతరాలు వచ్చాయన్నారు. స్ధానికంగా ఉన్న అవగాహన లోపాలవల్ల కొన్ని విఘాతాలు కలిగాయన్నారు. టీ కప్పులో తూఫానులాంటివి సృష్టించి వ్యవస్ధలో అంతరాలు తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. నేను తెలంగాణా రాష్ట్రంలో ఉండి స్వంత గ్రామం అయిన గుంటూరు జిల్లాలో ఓటు కావాలని అడిగాను, కాని కల్పించలేదన్నారు. ఒక పౌరుడిగా నా ఓటు హక్కు కోసం న్యాయపోరాటం చేస్తానన్నారు. ఓటు హక్కు కోసం అవసరమైతే హైకోర్టును ఆశ్రయిస్తాను అని స్పష్టం చేశారు. మీడియా సహకారం ఎంతో విలువైనది, ఎప్పుడు మరిచిపోనని నిమ్మగడ్డ రమేష్ అన్నారు.

ఏపీ హైకోర్టు పంచాయతీ ఎన్నికల్లో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిందని ఆయన అన్నారు. ఎన్నికల కమిషన్ ఒక రాజ్యాంగ వ్యవస్థ అని, 243కె ద్వారా విస్తృత అధికారాలు రాజ్యాంగం కల్పించిందన్నారు. ఎన్నికల కమిషన్ ఇతర వ్యవస్థలలో జోక్యం చేసుకోకూడదని, వాటికి గౌరవం ఇవ్వాలన్నారు. వ్యవస్థలపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. నామినేషన్ వెయ్యనివ్వలేనప్పుడు మరో అవకాశం ఇచ్చేందుకు ప్రయత్నం చేశామని నిమ్మగడ్డ రమేష్ చెప్పారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.