FbTelugu

పార్టీకి వెళ్లాను కాని డ్రగ్స్ తీసుకోలేదు: కలహర్ రెడ్డి

హైదరాబాద్: సినీ నిర్మాత శంకర్ గౌడ బెంగళూరులో ఇచ్చిన పార్టీలో నాతో పాటు హైదరాబాద్ చెందిన చాలా మంది పాల్గొన్నారుని డ్రగ్స్ కేసులో నిందితుడు, వ్యాపారవేత్త కలహర్ రెడ్డి వెల్లడించారు. మూడేళ్ల క్రితం పార్టీ జరిగింది వాస్తవమేనని ఆయన అంగీకరించారు.

డ్రగ్స్ కేసులో ఇవాళ కలహర్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి కొన్ని విషయాలు వెల్లడించారు. బెంగళూరు పార్టీలో బడా వ్యాపారవేత్తలు, ఈవెంట్ మేనేజర్లు, సినీ ప్రముఖులతో పాటు తెలంగాణ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారన్నారు. అయితే ఆ రోజు జరిగిన పార్టీ లో ఏం జరిగిందో తనకు తెలియదని, 300 మంది వరకు పాల్గొన్నారన్నారు. పార్టీకి సంబంధించి బెంగళూరు పోలీసులు నోటీసులు ఇవ్వడంతో వారి ఎదుట హాజరై  సమాధానం ఇచ్చానని ఆయన చెప్పారు. ఆ రోజు జరిగిన పార్టీలో నేను డ్రగ్స్ తీసుకోలేదని, డ్రగ్స్ తో ఎలాంటి సంబంధం లేదని కలహర్ రెడ్డి వివరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.