టాలీవుడ్ హీరోయిన్, గోవా బ్యూటీ ఇలియానా తన శరీర సౌష్టవంపై నిజాలను వెళ్లగక్కింది. పలు చిత్రాలలో నటించిన ఇలియానా టాలీవుడ్ లో అగ్రకథానాయికగా వెలుగొందింది.
తన శరీరం పట్ల తనకే కొంత ఇబ్బందిగా అనిపించేదని, అసంతృప్తికి లోనయ్యేదాన్నని చెప్పుకున్నది. శరీరం రంగు బాగానే ఉన్నా అందంగా లేనని, బాడీ కొలతలు ఉండాల్సిన స్థాయిలో లేవని బాధపడేదానన్నారు. అద్దంలో చూసుకుని మానసికంగా కుంగిపోయేదాన్నని ఇలియానా చెప్పుకున్నది. బాడీ డిస్ మార్పియా అనే ఫోబియా పై తన అభిప్రాయాన్ని వెల్లడించింది.
అమ్మాయిలకు మంచి శరీర సౌష్టవం ఉన్నా కొలతల ప్రకారం కాకుండా చిన్నగా ఉన్నట్లయితే తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు. దీనినే బాడీ డిస్ మార్పియా అంటుంటారు. రంగులో ఎంత అందంగా కన్పించినప్పటికీ అద్దంలో చూసుకున్నప్పడు మాత్రం కొలతల విషయంలో లోపం కొట్టొచ్చినట్లు కన్పిస్తుంది. ఒకప్పుడు నేను ఈ సమస్యతో వేదన అనుభవించానని, ఇప్పుడు నా శరీరంలో అనుకూలమన అంశాలను చూడడం నేర్చుకున్నానని ఇలియానా చెప్పింది. నా శరీరం నాకే సొంతం, ఈ అందం బాగుందని ఆమె తనకు తాను కితాబునిచ్చుకున్నది.