FbTelugu

నలుగురు కొడుకులున్నా… చూసే దిక్కులేదు!

I-have-four-sons

పిల్లలు బతుకు చరమాంకంలో ఆదుకుంటారనుకుంటే ముఖం చాటేశారు. కన్నబిడ్డలను చేయి చాచి అడగలేక ఇంతకాలం ఎలాగో నెట్టుకొచ్చారు. చీకట్లో చిరుదీపంలో ఆ పండుటాకులను ఆదుకుంటున్న పింఛను.. కూడా కొడుకు ప్రభుత్వ ఉద్యోగి కావడం వల్ల తొలగించారు. దీనావస్థలో ఉన్న తమ పరిస్థితి చూసి పింఛను మంజూరు చేయాలని కోరుకుంటున్నారు ఆ వృద్ధ దంపతులు. బిడ్డలు ప్రయోజకులై సర్కారు కొలువు సాధిస్తే అందరి కంటే ఎక్కువ సంతోషించేది తల్లిదండ్రులే. కానీ కొడుకు ప్రభుత్వ ఉద్యోగం చేయడం ఆ తల్లిదండ్రులకు శాపంగా మారింది. అదెలా అనుకుంటున్నారా…! ఉన్న ఒక్కగానొక్క ఆధారం పింఛను పోయింది. తమ పరిస్థితి చూసైనా పింఛను ఇప్పించమని వేడుకుంటున్నారు జనగామ జిల్లా నర్మెట్ట మండలం కనెబోయిన గూడెం దరవత్​ తండా కు చెందిన గుజరమ్మ.

You might also like