నల్లగొండ: తనకు సీఎం, మంత్రి పదవులొద్దని టీపీసీసీ ఇస్తే చాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఇటీవలే జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ.. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఆ పదవి కోసం కాంగ్రెస్ నాయకుల్లో నేనంటే నేనంటూ.. ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పీసీసీ రేసులో ముందువరసలో ఉన్న నాయకుల్లో ఒకరైన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. పీసీసీ పగ్గాలను తనకిస్తే రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తానన్నారు. గతంలోనే తనకు పీసీసీ ఇవ్వాలని కొరానని.. ఈ సారైనా తనకు ఆ పదవి వస్తుందనే ధీమాలో ఉన్నారు.