FbTelugu

నేను ఎవరినీ లక్ష్యంగా చేసుకోలేదు: వెంకట్రామిరెడ్డి

అమరావతి: తాను ఎవరినీ లక్ష్యంగా చేసుకోలేదని రాజ్యాంగం ప్రకారం.. తమకు ఉన్న హక్కుల గురించే మాట్లాడానంటూ ఏపీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి అన్నారు. వెంకట్రామిరెడ్డి వలన తనకు ప్రాణహాని ఉందంటూ ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అతనిపై నిఘా వేయాలంటూ రాష్ట్ర డీజీపీకి లేఖ రాయడం పట్ల వెంకట్రామిరెడ్డి స్పందించారు.

తనపై ఎస్ఈసీ డీజీపీకి లేఖ రాయడం సరికాదన్నారు. ఎన్నికల సంఘానికి, సర్కారుకు మధ్య జరుగుతున్న పోరాటంలో ఉద్యోగులు నలిగిపోతున్నారన్నారు. నిన్న వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రాణాపాయ పరిస్థితుల్లో ఎదుటివారి ప్రాణాలు తీసే హక్కును కూడా రాజ్యాంగం ఇచ్చిందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో.. ఎస్ఈసీ నిమ్మగడ్డ డీజీపీకి లేఖ రాశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.