FbTelugu

నేను టీఆర్ఎస్ కు ఓటేయ్యాలని చెప్పలేదు: ఉత్తమ్

హైదరాబాద్: టీఆర్ఎస్, బీజేపీ పార్టీ లు సోషల్ మీడియా ను అడ్డం పెట్టుకుని తప్పుడు ప్రచారాలతో రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నాయని టీపీసీసీ చీఫ్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. నా పేరు తో సంచలన వ్యాఖ్యలు అంటూ టీఆర్ఎస్ చేస్తున్న ప్రచారం అబద్ధం.. టీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు బుద్ది చెప్పాలని కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన పిలుపునిచ్చారు.

కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ రెండు ప్రజా వ్యతిరేక పార్టీ లే ఆ రెండు పార్టీలను ఓడించాలని ఉత్తమ్ గ్రేటర్ ఓటర్లను కోరారు. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు. తాను టీఆర్ఎస్ కు ఓటెయ్యమని అన్నట్టు వస్తున్న ప్రచారం బూటకమని, టీఆర్ఎస్ చేస్తున్న చీప్ జిమ్మిక్కు అని మండిపడ్డారు. టీఆర్ఎస్, బీజేపీ లను చిత్తుగా ఓడించండి.. బీజేపీ, టిఆర్ఎస్ లు ప్రజలకు ఏమి చేయలేక ఇలాంటి దొంగ నాటకాలతో కాలం గడుపుతున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.