FbTelugu

నాకే ఓటు హక్కు ఇవ్వలేదు: ఎన్నికల కమిషనర్

సుప్రీంకోర్టు వ్యాఖ్యలకు కట్టుబడి ఉండాలి
మంత్రులు వ్యాఖ్యలు సరికాదు
అతిక్రమిస్తే ఎస్ఈసీ చర్యలు తీసుకుంటుంది
విజయవాడ: నా సొంతూరు గుంటూరు జిల్లా దుగ్గిరాల, హైదరాబాద్ నగరంలో ఓటు హక్కు రద్దు చేసుకున్నా… సొంత ఊర్లో ఓటు నమోదు చేయమని అడిగా… నేను స్థానికంగా లేనని ఓటు ఇవ్వలేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఓటు హక్కు నమోదు పై అప్పీల్ కు వెళ్తా.. కాదంటే కోర్టు కు వెళతానన్నారు. ఎన్నికలపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలకు ప్రతి ఒక్కరు రాజ్యాంగ స్ఫూర్తి తో కట్టుబడి ఉండాలని రమేష్ కుమార్ స్పష్టం చేశారు. ఎవరైనా ధిక్కరిస్తే ఎస్ఈసీ చర్యలు తీసుకుంటుందని హచ్చరించారు. గవర్నర్ పిలుపు మేరకు ఆయనతో భేటి అయి కమిషన్ తీసుకుంటున్న చర్యలను వివరించానన్నారు. ఎన్నికల నిర్వహణ కు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడగ్గా… రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసి) కి వారధి లాగా పనిచేస్తానని చెప్పాను. తనకు వ్యక్తిగతంగా ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, డిజిపి గౌతమ్ సవాంగ్ తో ఎలాంటి భేదాలు లేవని స్పష్టం చేశానని నిమ్మగడ్డ రమేష్ తెలిపారు.

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రభుత్వం, ఉద్యోగులు సహకరిస్తున్నారని చెప్పాను. ముఖ్యంగా రాష్ట్ర మంత్రులు కోడ్ ఆఫ్ కండక్ట్ పాటించాలని, విమర్శించే ముందు ప్రభుత్వ పెద్దలు సంయమనం పాటించాలని నిమ్మగడ్డ రమేష్ సూచించారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తరువాత ప్రభుత్వ అధికారుల్లో సాయంత్రానికి మార్పు వచ్చిందని ఆయన అన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన ఇద్దరు ఐఏఎస్ అధికారులు పై చర్యలు తీసుకున్నామని వ్యాఖ్యలు చేయడం సుప్రీంకోర్టు తీర్పు నకు విరుద్ధన్నారు. వారి పై ఎలాంటి చర్యలు, సిఫార్సులు చేయలేదు.. మాకు కక్ష సాధింపు అంతకన్నా లేదని నిమ్మగడ్డ వివరించారు.
ఉద్యోగ సంఘాలతో నాకు సాన్నిహిత్యం ఉందన్నారు. ఇప్పటి వాళ్లకి తన గురించి తెలియదని, ఉద్యోగుల నుండి పూర్తి సహకారం వస్తోందన్నారు. ఏకగ్రీవాల పై ప్రముఖ పత్రికల్లో ప్రకటన రావడం పట్ల రాజకీయ పార్టీలు ఆందోళనవ్యక్తం చేసాయన్నారు. ఎన్నికల ప్రక్రియ వచ్చిన తరువాత ఈసీ దృష్టికి రాకుండా ప్రకటన చేశారు. ప్రభావితం చేసేలా ప్రకటన ఉందని, ఐ అండ్ పిఆర్ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి ని సంజాయిషీ కోరామన్నారు. గతంలో జరిగిన ఏకగ్రీవాలు బలవంతం జరిగాయని ఆరోపణలు ఉన్నాయి.. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఏకగ్రీవాలు పరిమితి దాటి అపరిమితంగా పెరిగితే ఎన్నికల కమిషన్ నిశితంగా పరిశీలిస్తుందన్నారు. ఏకగ్రీవాలు కుదరకుంటే నామినేషన్ దాఖలు చేసే మార్గం ఏర్పాటు కల్పించాలి అని జిల్లా కలెక్టర్ల కు చెప్పానని నిమ్మగడ్డ రమేష్ అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.